భీమా ట్రైలర్‌ ఊచకోతే... శ్మశానం కూడా సరిపోదట

February 25, 2024


img

గోపీచంద్, మాళవిక శర్మ, భవానీ శంకర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న భీమా సినిమా మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8న విడుదల కాబోతోంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో శనివారం భీమా ట్రైలర్‌ విడుదల చేశారు. ఊహించిన్నట్లే ట్రైలర్‌లో గోపీచంద్ స్టైల్లో పంచ్ డైలాగులు, యాక్షన్ సీన్స్ చూపారు. ఈ సినిమాలో గోపీచంద్ పవర్ పోలీస్ ఆఫీసర్‌గా చేశాడు. కన్నడ దర్శకుడు హర్ష దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాజర్, నరేశ్, పూర్ణ, వెన్నెల కిషోర్, రఘుబాబు, ముఖేష్ తివారీ, శ్రీనివాస్ రావు, చమ్మక్ చంద్ర, వెంకటేష్, చెలువరాజ్, రోలర్ రఘు, నీహారిక, రోహిణి తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. 

ఈ సినిమాకు కధ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: హర్ష, సంగీతం: రవి బస్రూర్, కొరియోగ్రఫీ: ఏ.హర్ష, కెమెరా: స్వామి జె గౌడ, స్టంట్స్: రామ్-లక్ష్మణ్, డా.రవివర్మ, వెంకట్, ఎడిటింగ్: తమ్మిరాజు చేశారు. 

శ్రీసత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ ఈ సినిమా నిర్మించారు.


Related Post

సినిమా స‌మీక్ష