రవితేజ కూడా థియేటర్ బిజినెస్‌లోకి

February 23, 2024


img

మన సినిమా హీరో, హీరోయిన్లకు ఒక్కో సినిమా చేయడానికి కోట్లలో పారితోషికం తీసుకుంటారు. ఆ వచ్చిన డబ్బుతో విలాసవంతమైన జీవితాలు గడుపుతూనే మిగిలిన డబ్బుతో కొత్త వ్యాపారాలలోకి దిగుతున్నారు. ముఖ్యంగా మన తెలుగు హీరోలు హోటల్‌ ఇండస్ట్రీ, సినిమా థియేటర్ బిజినెస్‌లపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.   

 సూపర్ స్టార్‌ మహేష్‌ బాబు ఏషియన్ సినిమాస్‌తో కలిసి గచ్చిబౌలిలో ఏఎంబి పేరుతో భారీ మల్టీప్లెక్స్ నిర్మించారు. అది విజయవంతంగా నడుస్తుండటంతో ఇప్పుడు బెంగళూరులో మరో మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నారు. 

ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌ కూడా అమీర్ పేటలో ఏఏఏ పేరుతో ఓ భారీ మల్టీప్లెక్స్ నిర్మించగా అది విజయవంతంగా నడుస్తోంది. రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ కూడా ఏషియన్ సినిమాస్‌తో కలిసి మహబూబ్ నగర్‌లో ఏవిడి పేరుతో మూడు స్క్రీన్స్ కలిగిన ఓ మల్టీప్లెక్స్ నిర్మించారు. ఇప్పుడు ఈ హీరోల జాబితాలో మాస్ మహారాజ్ రవితేజ కూడా చేరిపోయారు. 

రవితేజ కూడా ఏషియన్ సినిమాస్‌తో కలిసి హైదరాబాద్‌, దిల్‌సుక్‌నగర్‌లో ఏఆర్‌టి పేరుతో ఓ మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నారు. దీనిలో ఆరు స్క్రీన్స్ ఉంటాయి. త్వరలోనే దీని ప్రారంభోత్సవం జరుగబోతోంది.


Related Post

సినిమా స‌మీక్ష