సినిమా పేరు: భూతద్దం భాస్కర నారాయణ

February 10, 2024


img

ప్రస్తుతం తెలుగులో అచ్చమైన తెలుగు పేర్లతో, స్థానిక భాష, యాస, సంస్కృతీ సాంప్రదాయాలను ప్రతిబింబించే చక్కటి సినిమాలు వస్తున్నాయి. అటువంటిదే భూతద్దం భాస్కర నారాయణ. పురుషోత్తం రాజ్‌ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ క్రైమ్ త్రిల్లర్ సినిమాలో యువ నటుడు శివకందుకూరి, రాశి సింగ్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఆంధ్రా, కర్ణాటక సరిహద్దులోని ఓ చిన్న పట్టణంలో జరిగిన వరుస హత్యలు కధాంశంగా ఈ సినిమాని తెరకెక్కించారు.

ఈ సినిమాలో అరుణ్ కుమార్, దేవీ ప్రసాద్, వర్షిణి సౌందర్ రాజన్, శివ కుమార్, షఫీ, శివనారాయణ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.  

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: పురుషోత్తం రాజ్‌, సంగీతం: శ్రీచరణ్ పాకాల, విజయ్‌ దేవరకొండ బల్గనీన్, కెమెరా: గౌతమ్ జీ. స్టంట్స్‌: వింగ్ గన్‌మ్యాన్‌ అంజి, ఎడిటింగ్: గ్యారీ బీహెచ్, కొరియోగ్రాఫర్: రక్ష చేశారు. 

మిలియన్ డ్రీమ్స్, విజయ సరాగ ప్రొడక్షన్స్  బ్యానర్లపై స్నేహాల్ జంగల్, శశిధర్ కాశీ, కార్తీక్ ముడుంబి ఈ సినిమాని నిర్మించారు. ఈరోజే ఈ సినిమా ట్రైలర్‌ విడుదల చేశారు. పట్టణంలోని డిటెక్టివ్‌నని చెప్పుకునే హీరో  వరుస హత్యలు చేస్తున్న ఓ సీరియల్ కిల్లర్‌ని ఎలా కనుగొన్నాడనే క్రైమ్ థ్రిల్లర్ ఇది. ట్రైలర్‌ చూస్తే తప్పక చూడాల్సిన సినిమా అనే అనిపిస్తోంది. ఈ సినిమా మార్చి 1వ తేదీన విడుదల కాబోతోంది.       



Related Post

సినిమా స‌మీక్ష