ఫ్యామిలీ స్టార్‌ ఫస్ట్ లిరికల్

February 07, 2024


img

విజయ్‌ దేవరకొండకు ఖుషీ సినిమాతో ఖుషీ లభించకపోవడంతో ఈసారి మృణాళిని ఠాకూర్‌తో కలిసి ఫ్యామిలీ స్టార్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. పరశురామ్ దర్శకత్వంలో తీస్తున్న ఈ సినిమా అప్‌డేట్ గురించి అభిమానులు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. వారి కోసం నేడు లిరికల్ వీడియో సాంగ్ విడుదల చేశారు. 

“ఏమిటిది చెప్పీ చెప్పక ఎంత చెప్పిందో....” అంటూ చాలా మృధుమధురంగా సాగే ఈ పాటని అనంత్ శ్రీరామ్ వ్రాయగా, గోపీ సుందర్ చక్కగా స్వరపరిచారు. ఈ పాటను సిద్ శ్రీరామ్ చాలా చక్కగా పాడారు.    

శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్, వాసువర్మలతో కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం: గోపీ సుందర్, కెమెరా: కెయు మోహన్, ఆర్ట్: ఏఎస్ ప్రకాష్, ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్ చేస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్‌ 5వ తేదీన విడుదల కాబోతోంది. 


Related Post

సినిమా స‌మీక్ష