పుష్ప నటుడు జగదీష్ అరెస్ట్

December 06, 2023


img

అల్లు అర్జున్‌ హీరోగా చేసిన పుష్ప సినిమాలో కేశవ పాత్రలో సహాయ నటుడిగా నటించిన బండారు జగదీష్‌ను పంజగుట్ట పోలీసులు అరెస్ట్ చేసారు. అతను ఓ మహిళా జూనియర్ ఆర్టిస్ట్ మరో వ్యక్తితో సన్నిహితంగా ఉన్నప్పుడు తన మొబైల్ ఫోన్‌తో వారి ఫోటోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బ్లాక్ మెయిల్ చేయసాగాడు.

అతని వేధింపులు భరించలేక ఆ మహిళ నవంబర్‌ 29న తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొంది. అప్పటి నుంచి జగదీష్ తప్పించుకొని తిరుగుతున్నాడు. అతని కోసం గాలిస్తున్న పంజగుట్ట పోలీసులు బుధవారం అతనిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం అతనికి 14 రోజులు జ్యూడిషియల్ రిమాండ్‌ విధించడంతో చంచల్ గూడా జైలుకి తరలించారు.

జగదీష్ మల్లేశం, జార్జిరెడ్డి, పలాస1978, సత్తిగాని రెండెకారాలు సినిమాలలో చేశాడు. పుష్ప సినిమా సూపర్ హిట్ అవడంతో ఇప్పుడు వరుసపెట్టి సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఇటువంటి సమయంలో క్రిమినల్ కేసులో అరెస్ట్ అయ్యి జైలు పాలవడంతో కెరీర్ నాశనం చేసుకొన్నాడు. 


Related Post

సినిమా స‌మీక్ష