సలార్ ట్రైలర్‌... మరో కెజీఎఫ్‌?

December 02, 2023


img

 ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్, శ్రుతీ హాసన్‌ జంటగా నటిస్తున్న సలార్ సినిమా ట్రైలర్‌ శుక్రవారం సాయంత్రం 7.19 గంటలకు విడుదలైంది. అది చూస్తే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ ‘కెజీఎఫ్‌’ చిత్రాలను చూస్తున్నట్లే ఉంది. 

కెజిఎఫ్ కోసం ప్రశాంత్ నీల్ ఓ కృత్రిమ ప్రపంచాన్ని సృష్టించిన్నట్లే, దీనిలోని ఖాన్సార్ అనే ఓ సామ్రాజ్యాన్ని సృష్టించి, దానిలో ఆధిపత్యం కోసం జరిగే పోరు, ఆ పోరులో  రష్యన్, సెర్బియన్ ఆర్మీల యుద్ధాలను చూపారు.

దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రేక్షకులకు కధ పట్ల నమ్మకం కలిగించేందుకు వెయ్యేళ్ళ క్రితం జరిగిన బందిపోటు దొంగల గురించి చెపుతూ, కధ మొదలుపెట్టి, వర్తమానంలో ఖాన్సార్ సామ్రాజ్యానికి తీసుకువచ్చి దానిలో ఇద్దరు బాల్య స్నేహితులు ప్రభాస్, పృధ్వీరాజ్‌లను పరిచయం చేశారు.

ఆ సామ్రాజ్యానికి జగపతిబాబు వారసుడుగా పృధ్వీరాజ్‌, అతనిని చంపి ఆ సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడానికి శత్రువులు దాడి చేయడం చూపారు. అప్పుడు పృధ్వీరాజ్ తన చిన్ననాటి స్నేహితుడు సలార్ (ప్రభాస్‌)ని రప్పిస్తే, అతను శత్రుమూకలను చీల్చి చెండాడిన్నట్లు ట్రైలర్‌లో చూపారు. 

ఈ సినిమాలో ప్రభాస్, శ్రుతీ హాసన్, పృధ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, ఈశ్వరీ రావు, శ్రీయరెడ్డి, బాలీవుడ్‌ సీనియర్ నటుడు టిను ఆనంద్, రామచంద్రరాజు, సప్తగిరి, బ్రహ్మాజీ, పృధ్వీరాజ్, ఝాన్సీ, మధు గురుస్వామి, నాగ మహేశ్, దుబ్బాక భాస్కరరావు, జెమిని సురేశ్ ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకు సంగీతం: రాష్ట్రవ్యాప్తంగా బస్రూర్, కెమెరా: భువన్ గౌడ, ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి చేస్తున్నారు. 

హోంభోలే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ్‌ దేవరకొండ కిరగందూర్ రూ.200-250 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా సలార్ నిర్మిస్తున్నారు. సలార్ ఈ నెల 22న విడుదల కాబోతోంది.Related Post

సినిమా స‌మీక్ష