సలార్ ట్రైలర్‌... ఈరోజు సాయంత్రమే విడుదల

December 01, 2023


img

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్, శ్రుతీ హాసన్‌ జంటగా నటిస్తున్న సలార్ సినిమా ట్రైలర్‌ ఈరోజు సాయంత్రం 7.19 గంటలకు విడుదల కాబోతోంది. 3.47 నిమిషాలు నిడివి గల సలార్ ట్రైలర్‌ ఒకేసారి 5 భాషలలో విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ట్విట్టర్‌లో తెలియజేసింది. 

 సలార్ సినిమాలో జగపతిబాబు, ఈశ్వరీ రావు, శ్రీయరెడ్డి, పృధ్వీరాజ్ సుకుమారన్, టీను ఆనంద్, రామచంద్రరాజు, సప్తగిరి, బ్రహ్మాజీ, పృధ్వీరాజ్, ఝాన్సీ, మధు గురుస్వామి, నాగ మహేశ్, దుబ్బాక భాస్కరరావు, జెమిని సురేశ్ ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకు సంగీతం: రాష్ట్రవ్యాప్తంగా బస్రూర్, కెమెరా: భువన్ గౌడ, ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి చేస్తున్నారు. 

హోంభోలే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ్‌ దేవరకొండ కిరగందూర్ రూ.200-250 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా సలార్ నిర్మిస్తున్నారు. సలార్ ఈ నెల 22న విడుదల కాబోతోంది.


Related Post

సినిమా స‌మీక్ష