హనుమాన్ నుంచి ఆవకాయ... ఆంజనేయ... లిరికల్ సాంగ్ రిలీజ్

November 29, 2023


img

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా, అమృత అయ్యర్ జంటగా నటిస్తున్న హనుమాన్ సినిమా నుంచి ఆవకాయ... ఆంజనేయ... అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది. హీరోయిన్‌పై కొన్ని దుష్టశక్తులు దాడిచేయబోతుంటే, హనుమంతుడి నుంచి దివ్యశక్తులు పొందిన హీరో ఆమెను కంటికి రెప్పలా కాపాడుకొంటున్నట్లు ఈ లిరికల్ వీడియో సాంగ్‌లో చూపారు. దానికి అతీతశక్తులకు ఆవకాయ అంటూ పాట కట్టడం విశేషం. 

మన్నెల సింహాచలం వ్రాసిన ఈ పాటకు అనుదీప్ దేవ్ జానపద బాణీలో సంగీతం సమకూర్చగా, సాహితీ గాలిదేవర అంతే చక్కగా పాడింది.  

వందల కోట్ల భారీ బడ్జెట్‌తో ప్రభాస్ హీరోగా ఆదిపురుష్ విమర్శలు ఎదుర్కొంటున్న సమయంలోనే  చిన్న బడ్జెట్‌తో తీస్తున్న హనుమాన్ ఫస్ట్-లుక్ పోస్టర్‌, టీజర్ విడుదలై అందరినీ ఆకట్టుకొన్నాయి.

ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్‌, వెన్నెల కిషోర్, వినయ్ రాయ్, సత్య, గెటప్ శ్రీను, రాజ్ దీపక్ శెట్టి ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకు సంగీతం: అనుదీప్ దేవ్, హరిగౌర, కృష్ణ సౌరభ్, కెమెరా: దాశరధి శివేంద్ర, ఎడిటింగ్: సాయి బాలు తలారి చేస్తున్నారు. 

ఈ సినిమాను తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళం , హిందీ, మరాఠీ భాషలతో పాటు ఇంగ్లీష్, జపనీస్, కొరియన్, చైనీస్, స్పానిష్ భాషలలోను వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయబోతున్నారు.

సంక్రాంతికి పెద్ద సినిమాలు విడుదలవుతున్నప్పటికీ వాటితో పోటీకి సిద్దమని ప్రశాంత్ వర్మ చెప్పడం ద్వారా తన సినిమాపై ఎంత నమ్మకంగా ఉన్నారో అర్దం చేసుకోవచ్చు. 

ఈ సినిమాను ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. 

        


Related Post

సినిమా స‌మీక్ష