నాగ చైతన్య 'దూత' వెబ్‌ సిరీస్‌ ట్రైలర్‌

November 23, 2023


img

ఇంతవరకు సినిమాలకే పరిమితమైన నాగ చైతన్య మొదటిసారిగా ‘దూత’ అనే వెబ్‌ సిరీస్‌తో ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో తీసిన ఈ వెబ్‌ సిరీస్‌ డిసెంబర్‌ 1 నుంచి హిందీతో సహా నాలుగు దక్షిణాది భాషల్లో అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం కాబోతోంది. 

క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కించిన దూత ట్రైలర్‌ ఈరోజు విడుదలైంది. దీనిలో నాగ చైతన్య సాగర్ అనే ఓ జర్నలిస్టుగా నటించాడు. జర్నలిస్టుల ఆత్మహత్యలు లేదా ప్రమాదాల రూపంలో హత్యలను కధాంశంగా తీసుకొన్నట్లు పోస్టర్ చూస్తే అర్దమవుతోంది. 

దూతలో వెబ్‌ సిరీస్‌లో నాగ చైతన్యకు జోడీగా తమిళ నటి సత్యాప్రియ భవానీ శంకర్ నటించింది. ప్రాచీ దేశాయ్, పార్వతి తిరువోతు తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. 



Related Post

సినిమా స‌మీక్ష