అడవి శేష్ జీ-2లో బనిత సంధు

November 20, 2023


img

టాలీవుడ్‌ యువ నటులలో అడవి శేష్ చేసిన మేజర్, గూడచారి, హిట్-2 మూడు సినిమాలతోనే తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొన్నారు. తాజాగా వినయ్ కుమార్‌ సిరింగినీడి రెడ్డి దర్శకత్వంలో గూడచారి సినిమాకు సీక్వెల్‌గా జీ-2 తీస్తున్నాడు. 

ఈ సినిమాలో అడవి శేష్‌కు జోడీగా శోభితా దూళిపాళ, సుప్రియ యార్లగడ్డ నటిస్తుండగా తాజాగా బనిత సంధు కూడా వచ్చి చేరిన్నట్లు జీ-2 ట్విట్టర్‌ ద్వారా తెలియజేసింది. 

ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై ప్రముఖ నిర్మాతలు టిజి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ కలిసి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు.

ఈ ఏడాది అక్టోబర్ నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. భారత్‌, యూఏఈ, ఫ్రాన్స్ దేశాలలో ఈ సినిమా షూటింగ్‌ జరుగుతోంది.

 

Related Post

సినిమా స‌మీక్ష