ప్రభాస్ తర్వాత సినిమాకి దర్శకుడు ఎవరో తెలుసా?

November 20, 2023


img

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్, శ్రుతీ హాసన్ జంటగా నటించిన సలార్ చిత్రం డిసెంబర్‌ 22న విడుదల కాబోతోంది. దానితో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తున్న కల్కి ఎడి 2898 వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కాబోతోంది. 

మారుతి దర్శకత్వంలో చేస్తున్న రాజా డీలక్స్ సినిమా బహుశః 2024 ఏప్రిల్-మే నెలల్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇవికాక మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘భక్త కన్నప్ప’ సినిమాలో ప్రభాస్ శివుడిగా నటించబోతున్నాడు. 

పాన్ ఇండియా హీరోగా ఎదిగిన ప్రభాస్ వరుసపెట్టి ఇన్ని సినిమాలు చేస్తుండటమే ఆశ్చర్యం అనుకొంటే తాజాగా మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన్నట్లు తెలుస్తోంది. సీతారామం వంటి సూపర్ హిట్ సినిమా అందించిన హను రాఘవపూడి దర్శకత్వంలో సినిమా చేసేందుకు ప్రభాస్ ఓకే చెప్పేసిన్నట్లు తెలుస్తోంది. 

ప్రభాస్‌తో సినిమా అంటే అది తప్పనిసరిగా పాన్ ఇండియా మూవీయే అని అనుకొనే పరిస్థితి. కనుక దీనిని హాలీవుడ్‌లో ఓ ప్రముఖ సినీ నిర్మాణ సంస్థతో కలిసి యూవీ క్రియేషన్స్ సంస్థ రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా తీయబోతున్నట్లు సమాచారం. రెండో ప్రపంచ యుద్ధం నేపధ్యంలో జరిగే కధతో ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన వెలువడనుంది. 


Related Post

సినిమా స‌మీక్ష