నాగ చైతన్య కూడా వెబ్‌ సిరీస్‌... అమెజాన్ ప్రైమ్‌లో దూత!

November 15, 2023


img

ఇప్పటికే పలువురు అగ్రనటులు వెబ్‌ సిరీస్‌ చేస్తూ ప్రేక్షకులకు మరింత చెరువుయవుతున్నారు. తాజాగా అక్కినేని నాగ చైతన్య కూడా దూత అనే వెబ్‌ సిరీస్‌తో ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో తీసిన ఈ వెబ్‌ సిరీస్‌ డిసెంబర్‌ 1నుంచి హిందీతో సహా నాలుగు దక్షిణాది భాషల్లో అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం కాబోతోంది. 

నాగ చైతన్య హర్రర్ సినిమాలు చూడటానికి కూడా ఇష్టపడరు. అవంటే తనకు చాలా భయమని ఇదివరకు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ ఇప్పుడు హర్రర్, థ్రిల్లర్ జోనర్‌లోనే ఓటీటీలోకి దూతగా ఎంట్రీ ఇస్తుండటం విశేషం. దీనిలో నాగ చైతన్య ఓ జర్నలిస్టుగా నటిస్తున్నట్లు పోస్టర్‌లో చూపారు. జర్నలిస్టుల ఆత్మహత్యలు లేదా ప్రమాదాలను కధాంశంగా తీసుకొన్నట్లు పోస్టర్ చూస్తే అర్దమవుతోంది. 

ఇది మిస్టరీయా లేక మెసేజా అనే విషయంలో త్వరలో మీరే తెలుసుకుంటారని పోస్టర్‌లో పేర్కొన్నారు. దూతలో నాగ చైతన్యకు జోడిగా తమిళ నటి ప్రియా భవానీ శంకర్ నటించింది.


Related Post

సినిమా స‌మీక్ష