యానిమల్ నుంచి నాన్నా నువ్వే నా ప్రాణం పాట రిలీజ్

November 15, 2023


img

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా వస్తున్న యానిమల్ తెలుగు వెర్షన్ నుంచి నాన్న నువ్వే నా ప్రాణం పాట విడుదల చేశారు. ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు రణబీర్ కపూర్, రష్మిక మందన జంటగా నటిస్తున్నారు. బాలీవుడ్‌ నటులు అనిల్ కపూర్, బాబీ డియోల్, శక్తి కపూర్, సురేశ్ ఓబ్రాయ్, ప్రేమ్ చోప్రా, తృప్తీ దిమ్రీ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. తండ్రీ కొడుకుల సెంటిమెంట్‌తో సాగే ఈ సినిమాకి తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తుండటం, దానిలో రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తుండటం విశేషమే. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్: సందీప్ రెడ్డి వంగా, కెమెరా: అమిత్ రాయ్, సంగీతం: హర్షవర్ధన్, రామేశ్వర్ చేస్తున్నారు. సుమారు వంద కోట్ల భారీ బడ్జెట్‌తో టీ-సిరీస్ ఫిలిమ్స్, భద్రకాళి పిక్చర్స్, సినీ ఒన్ స్టూడియోస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, కృశాన్ కుమార్, మురాద్ కేటాని, ప్రణయ్ రెడ్డి వంగా కలిసి నిర్మిస్తున్నారు. డిసెంబర్‌ 1వ తేదీన యానిమల్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. 

        


Related Post

సినిమా స‌మీక్ష