తర్వాత మల్టీస్టార్ సినిమానే: అట్లీ

November 14, 2023


img

బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్‌కు తాజాగా ‘జవాన్’ వంటి సూపర్ హిట్ ఇచ్చిన కోలీవుడ్‌ దర్శకుడు అట్లీ, తన తదుపరి చిత్రం మల్టీస్టార్ అని చెప్పారు. జవాన్ చేస్తున్నప్పుడే షారూక్ ఖాన్‌ తనతో మరో సినిమా చేయాలనుకొంటున్నట్లు చెప్పారని, వీలైతే కోలీవుడ్‌ హీరో విజయ్‌తో మల్టీస్టార్ చేసేందుకు సిద్దమని చెప్పారని అట్లీ చెప్పారు.

ఇటీవల వాళ్ళిద్దరూ ఓ ఫంక్షన్‌లో కలిసినప్పుడు కలిసి సినిమా చేద్దామని నిర్ణయించుకొన్నాక అక్కడి నుంచే తనకు ఫోన్ చేసి ఆ విషయం చెప్పారని అట్లీ చెప్పారు. ఇప్పటికే ఈ మల్టీస్టార్ సినిమా స్క్రిప్ట్ పని జోరుగా సాగుతోందని త్వరలోనే వివరాలు వెల్లడిస్తానని అట్లీ చెప్పారు.

జవాన్‌లో షారూక్ ఖాన్ నటన, ఎనర్జీ చూసినప్పటి నుంచి ఆయన వీరాంభిమానినై పోయానని అట్లీ చెప్పారు. షారూక్ ఖాన్, విజయ్‌ ఇద్దరిలో ఎవరు ఇష్టమని అడిగితే మాత్రం సమాధానం చెప్పలేనని అట్లీ చెప్పారు. ఇద్దరు గొప్ప నటులతో మల్టీస్టార్ చేసే అవకాశం తనకు లభించడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని అట్లీ అన్నారు. ఓ హాలీవుడ్ సినీ నిర్మాణ సంస్థ కూడా తనతో ఓ సినిమా చేసేందుకు ఎదురుచూస్తోందని దర్శకుడు అట్లీ చెప్పారు.


Related Post

సినిమా స‌మీక్ష