చిరంజీవికి జోడీగా అనుష్క?

September 18, 2023


img

మిస్ పోలిశెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలో నవీన్ పోలిశెట్టికి జోడీగా నటించి హిట్ కొట్టిన స్వీటీ అనుష్క తర్వాత మెగాస్టార్ చిరంజీవికి జోడీగా చేయబోతున్నట్లు తాజా సమాచారం. ఈ సినిమా కోసమే దర్శక నిర్మాతలు అనుష్కను సంప్రదించిన్నట్లు తెలుస్తోంది. చిరంజీవితో సినిమా చేసే అవకాశం వస్తే ఏ హీరోయిన్‌ అయినా ఎగిరి గేంతేస్తుంది. కనుక అనుష్క ఈ సినిమాలో చేయడం ఖాయమనే భావించవచ్చు.

కళ్యాణ్ రామ్‌కు బింబిసార వంటి సూపర్ హిట్ అందించిన వశిష్ట ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు. ఈ సినిమాను కూడా వశిష్ట సోషియో ఫ్యాంటసీగానే తెరకెక్కించబోతున్నారు. ‘మెగా 157’ వర్కింగ్ టైటిల్‌తో ఈ నెల 10న ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. 

ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బేనర్‌పై వంశీ, విక్రమ్, ప్రమోద్ కలిసి నిర్మించబోతున్నారు. మెగా 157 సినిమాకి కెమెరా: ఛోటా కె. నాయుడు, సంగీతం: ఎంఎం కీరవాణి అందిస్తారు. త్వరలోనే ఈ సినిమాకు సంబందించి పూర్తి వివరాలు ప్రకటిస్తామని దర్శకుడు వశిష్ట చెప్పారు.     Related Post

సినిమా స‌మీక్ష