నిత్యా మీనన్ 'కుమారి శ్రీమతి' వెబ్‌ సిరీస్‌ త్వరలో

September 16, 2023


img

నిత్యా మీనన్ మలయాళ నటి అయినప్పటికీ, కాస్త బరువు పెరిగినప్పటికీ తెలుగు ప్రేక్షకుల హృదయాలలో మంచి స్థానం సంపాదించుకొంది. ఆమె నటన, ఎంచుకొంటున్న సినిమాలే ఇందుకు కారణం. తాజాగా ఆమె అమెజాన్ ప్రైమ్‌ కోసం ప్రత్యేకంగా నిర్మిస్తున్న ‘కుమారి శ్రీమతి’ అనే వెబ్‌ సిరీస్‌ చేస్తోంది. శ్రీనివాస్ అవసరాల అందించిన కధను గోమటేశ్ ఉపాధ్యాయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. దీనిని కొత్తగా సినీ నిర్మాణ రంగంలో ప్రవేశించిన ‘ఎర్లీ మాన్‌సూన్ టేల్స్’ అనే సంస్థతో కలిసి వైజయంతీ మూవీస్ తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషలలో నిర్మిస్తోంది. 

ఈ వెబ్‌ సిరీస్‌ ఫస్ట్-లుక్ పోస్టర్‌, మోషన్ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఓ పల్లెటూరులో నివసించే తన కుటుంబాన్ని పోషించేందుకు పెళ్ళి చేసుకోకుండా ఉండిపోవాలని నిర్ణయించుకొంటుందని, ఉద్యోగం చేయకుండా ఏదైనా బిజినెస్ చేయాలనుకొంటోందని ఇద్దరు మహిళల సంభాషణతో హీరోయిన్‌ ఉన్నత వ్యక్తిత్వాన్ని చక్కగా అవసరాల చక్కగా ఆవిష్కరించారు. అయితే ఈ వెబ్‌ సిరీస్‌కు ‘కుమారి శ్రీమతి’ అనే విలక్షణమైన టైటిల్ పెట్టడం ద్వారా కామెడీ కూడా పుష్కలంగా ఉండబోతోందని సూచించిన్నట్లు భావించవచ్చు. 

ఇప్పుడే మోషన్ పోస్టర్ పెట్టారు కనుక కుమారి శ్రీమతి కోసం ఓటీటీ ప్రేక్షకులు మరికొన్ని రోజులు ఎదురుచూడక తప్పదు.


Related Post

సినిమా స‌మీక్ష