హతవిధీ.... మిస్.శెట్టి మిస్టర్ పోలిశెట్టి

June 01, 2023


img

స్వీటీ అనుష్క, జాతిరత్నం నవీన్ పోలిశెట్టి కలిసి చేస్తున్న సినిమా మిస్.శెట్టి మిస్టర్ పోలిశెట్టి. మహేష్ బాపు దర్శకత్వంలో వస్తున్న ఈ రొమాంటిక్ కామెడీ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి హతవిధీ... అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ విడుదలైంది. 

ఈ సినిమాలో అనుష్క లండన్‌లో ఓ స్టార్ హోటల్‌లో చెఫ్‌గా పనిచేస్తుంటే, నవీన్ పోలిశెట్టి స్టాండప్ కమెడియన్‌గా నటించారు. వీరిద్దరి మద్య ఏవిదంగా ప్రేమ చిగురించింది... ఏం జరిగిందనేది ఈ సినిమా కధాంశంగా కనిపిస్తోంది.  ఈ సినిమాలో మురళీశర్మ, జయసుధ, తులసి, నాజర్, కౌశిక్ మెహతా, అభినవ్ గోమఠం, సోనియా తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం పి. మహేష్ బాబు, పాటలు: రామజోగయ్య శాస్త్రి, సంగీతం: రాధన్, కెమెరా: నీరావ్ షా, కొరియోగ్రఫీ: రాజు సుందరం మాస్టార్, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు చేస్తున్నారు. 

వంశీ, ప్రమోద్ కలిసి యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది.

   


Related Post

సినిమా స‌మీక్ష