బాలకృష్ణ సినిమా టైటిల్‌ భగవత్ కేసరి?

May 30, 2023


img

అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ జంటగా సిద్దమవుతున్న సినిమాకు టైటిల్‌ ‘భగవత్ కేసరి’ అని సబ్ టైటిల్ “ఐ డోంట్ కేర్..” అని ఖరారు చేసిన్నట్లు తెలుస్తోంది. జూన్ 10న బాలయ్య పుట్టినరోజున ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్-లుక్‌ రెండూ విడుదల చేయనున్నారు. 

ఈ సినిమాలో బాలయ్య కూతురుగా శ్రీలీల నటిస్తోంది. ఇది తండ్రీకూతుర్ల సెంటిమెంట్ సినిమాగా తెరకెక్కిస్తున్నప్పటికీ దీనిలో బాలయ్య మార్క్ యాక్షన్, పంచ్ డైలాగ్స్ షరా మామూలే. మరో విశేషమేమిటంటే ఈ సినిమా కధాంశం తెలంగాణ నేపధ్యంలో సాగుతుంది. కనుక తెలంగాణ యాసలో బాలయ్య డైలాగ్స్ ఉండవచ్చు. 

 అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో రెండు హిట్స్ కొట్టిన బాలయ్య ఈ సినిమాతో మరో హిట్ కొట్టి హ్యాట్రిక్ సాధించాలని పట్టుదలగా ఉన్నారు. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాకు ధమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ దాదాపు పూర్తికావస్తోంది. ఈ ఏడాది దసరా పండుగ సమయానికి ఈ సినిమాని విడుదల చేయాలాయి దర్శక నిర్మాతలు భావిస్తున్నారు.  

   



Related Post

సినిమా స‌మీక్ష