వినాయక చవితికి వస్తున్న చంద్రముఖి-2

May 30, 2023


img

రజనీకాంత్ ప్రధానపాత్రలో 2005లో వచ్చిన చంద్రముఖి సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయ్యిందో అందరికీ తెలుసు. అయితే రజనీకాంత్ ఆ సినిమాకు సీక్వెల్‌ చేసేందుకు అంగీకరించకపోవడంతో పి.వాసు దర్శకత్వంలోనే వెంకటేష్ హీరోగా 2010లో నాగవల్లి పేరుతో తీశారు. కానీ అది చంద్రముఖిలా హిట్ అవలేదు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత దర్శకుడు పి.వాసు చంద్రముఖి-2 పేరుతో మరోసారి సీక్వెల్‌ సిద్దం చేస్తున్నారు. ఈ సినిమాలో లారెన్స్ రాఘవ, బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్, రాధికా శరత్ కుమార్‌, లక్ష్మీ మీనన్, వడివేలు తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసి  ఏడాది సెప్టెంబర్‌లో వినాయక చవితి పండుగ రోజున విడుదల చేసేందుకు సన్నాహాలు చేసుకొంటున్నారు. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ చంద్రముఖి సీక్వెల్‌ నిర్మిస్తున్నారు.          Related Post

సినిమా స‌మీక్ష