పవన్‌, సాయిధరం కలిసి వచ్చేశారు బ్రో!
May 29, 2023
img
సముద్రఖని దర్శకత్వంలో పవన్‌ కళ్యాణ్‌ హీరోగా చేస్తున్న బ్రో సినిమాలో సాయిధరం తేజ్ కూడా ఓ ముఖ్యమైన పాత్ర చేస్తున్నాడు. ఆ విషయం తెలియజేస్తూ ఇప్పటికే ఓ పోస్టర్‌ కూడా విడుదల చేశారు. అయితే పవన్‌ కళ్యాణ్‌ అభిమానుల కోరిక మేరకు ఈ సినిమాలో పవన్‌ కళ్యాణ్‌, సాయిధరం తేజ్ ఇద్దరూ కలిసున్న పోస్టర్‌ను కూడా చిత్ర బృందం విడుదల చేసింది. అది చూసి అభిమానులు చాలా సంతోషిస్తున్నారు.
తమిళ సినిమా ‘వినోదాయ సితం’లో సముద్రఖని కాలచక్రం (దేవుడు)గా నటించగా దాని తెలుగు రీమేక్‌గా వస్తున్న బ్రోలో పవన్‌ కళ్యాణ్‌ ఆ పాత్ర చేస్తున్నారు. అయితే తెలుగు వెర్షన్‌లో సాయిధరం చేస్తున్న పాత్ర తమిళ్ వెర్షన్‌లో లేదు. ఆ సినిమా మెయిన్ పాయింట్ ఒక్కటే తీసుకొని, పవన్‌ కళ్యాణ్‌ ఇమేజ్‌, తెలుగు నేటివిటీకి అనుగుణంగా కధను పూర్తిగా మార్చి తీస్తున్నారు. అందుకే ఈ సినిమాలో ప్రత్యేకంగా సాయిధరం తేజ్ పాత్రను సృష్టించిన్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్‌ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందిస్తుండటంతో భారీగా అంచనాలున్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు జీస్టూడియోస్ బ్యానర్లపై టిజి విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీతం: తమన్, కెమెరా: సుజిత్ వాసుదేవ్, ఆర్టిస్ట్‌ డైరెక్టర్: ఏఎస్ ప్రకాష్, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు. జూలై 28న బ్రో వస్తున్నాడు.
Here's the 1st Peek at #BroTheAvatar Combo that'll set the screens ablaze on July 28th 🤙🔥 #BROTheDuo 💥@PawanKalyan & @IamSaiDharamTej 🤩@thondankani @MusicThaman @vishwaprasadtg @vivekkuchibotla @bkrsatish @TheKetikaSharma@NavinNooli @ZeeStudios_ @zeestudiossouth… pic.twitter.com/B2bwd8rPQo
— People Media Factory (@peoplemediafcy) May 29, 2023
సినిమా స‌మీక్ష