ఇక మైసూరులో గేమ్ ఛేంజర్‌... యాక్షన్

May 25, 2023


img

శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్‌, కియరా అద్వానీ జంటగా తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్‌ సినిమా హైదరాబాద్‌ షెడ్యూల్ పూర్తవడంతో తర్వాత షెడ్యూల్ కోసం వచ్చే నెల మొదటివారంలో మైసూరుకు వెళ్ళబోతున్నారు. హైదరాబాద్‌ షెడ్యూల్లో భారీ క్లైమాక్స్‌ ఫైయిటింగ్ సీన్ షూట్ చేశామని శంకర్ స్వయంగా ఇదివరకే తెలియజేశారు. ఇప్పుడు మైసూరులో దాదాపు పది రోజులపాటు హీరో హీరోయిన్లు, ఇతర నటీనటులతో కొన్ని ముఖ్య సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. 

ఈ సినిమాలో శ్రీకాంత్, సునీల్, ఎస్.జె.సూర్య, జయరాం, నవీన్ చంద్ర, నాజర్, రఘుబాబు, సముద్రఖని తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.  

రూ.170 కోట్ల భారీ బడ్జెట్‌తో దిల్‌రాజు, అల్లు శిరీష్ కలిసి శ్రీ వేంకటేశ్వర క్రియెషన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కధ: కార్తీక్ సుబ్బరాజు, కెమెరా తిరు, ఆర్‌ రత్నవేలు, థమన్ సంగీతం అందిస్తున్నారు.Related Post

సినిమా స‌మీక్ష