బ్రో సినిమాలో మార్కండేయులుగా సాయిధరం తేజ్

May 24, 2023


img

సముద్రఖని దర్శకత్వంలో విడుదలకు సిద్దమవుతున్న బ్రో సినిమాలో పవన్‌ కళ్యాణ్‌తో పాటు సాయి ధరం తేజ్ కూడా ఓ ముఖ్యపాత్ర చేస్తున్నాడు. ఆ సినిమాలో తన పాత్ర పేరు మార్కండేయులు (మార్క్) అని తెలియజేస్తూ సాయి ధరం తేజ్ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. “నా మనసుకు దగ్గర ఉన్న పాత్రలలో ఇదీ ఒకటి. ఆయన మన అందరి జీవిత ప్రయాణం. అతను పరిచయం చేసిన ఈ ‘మార్క్’ అందరూ ఇష్టపడతారు,” అంటూ ట్వీట్‌ చేశారు.

ఈ సినిమాలో పవన్‌ కళ్యాణ్‌ కాలచక్రం (దేవుడు)గా నటిస్తున్నారు. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘వినోదాయ సితం’ సినిమాకు ఇది తెలుగు రీమేక్. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు, త్రివిక్రం శ్రీనివాస్‌ డైలాగ్స్, స్క్రీన్ ప్లే ఇస్తుండటంతో ఈ సినిమాపై చాలా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 

ఈ సినిమాకు సంగీతం: తమన్, కెమెరా: సుజిత్ వాసుదేవ్, ఆర్టిస్ట్‌ డైరెక్టర్: ఏఎస్ ప్రకాష్, ఎడిటింగ్: నవీన్ నూలి. 

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు జీస్టూడియోస్ బ్యానర్లపై టిజి విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పవన్‌ కళ్యాణ్‌ తన పాత్రను చాలా రోజుల క్రితమే పూర్తిచేశారు. కనుక దర్శకుడు సముద్రఖని మిగిలినవారితో షూటింగ్‌ పూర్తి చేస్తున్నారు. ఈ సినిమా జూలై 23వ తేదీన విడుదల కాబోతోంది.


Related Post

సినిమా స‌మీక్ష