మహేష్ బాబు-త్రివిక్రమ్ సినిమా రిలీజ్‌ డేట్ ఫిక్స్

March 27, 2023


img

మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్‌ దర్శకత్వంలో మహేష్ బాబు, పూజా హెగ్డే, శ్రీలీల హీరోహీరోయిన్లుగా ఎస్ఎస్‌ఎంబీ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్న సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13వ తేదీన విడుదల చేయబోతున్నట్లు సినీ నిర్మాణసంస్థ హారిక & హాసిని క్రియెషన్స్ సోమవారం ప్రకటించింది. దీంతోపాటు ఈ సినిమాలో మహేష్ బాబు ఫస్ట్-లుక్‌ పోస్టర్‌ కూడా విడుదలచేసింది. దీనిలో మహేష్ బాబు సిగరెట్ కాల్చుతూ ముందు నడుస్తుంటే వెనుక నుంచి ఓ లారీ, మరో వైపు ఓ కార్ వస్తున్నట్లు చూపారు. ఏదో ఫైటింగ్ సీన్ జరిగిన తర్వాత హీరోని చూసి భయపడుతూ రోడ్డు కిరువైపులా చేతులు జోడించి మోకాళ్ళపై కూర్చొన్నట్లు కొందరిని చూపారు.   

ఈ సినిమాలో నటిస్తున్నారు. కన్నడ నటుడు రవిచంద్రన్ మహేష్ బాబుకి తండ్రిగా నటించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాకు “అసుర సంధ్యవేళ” అని పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. దీనిని ఇంకా ధృవీకరించవలసి ఉంది 

ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం ఎస్.తమన్, కెమెరా: పిఎస్ వినోద్, ఎడిటింగ్ నవీన్ నూలి, ఆర్ట్ డైరెక్టరుగా ఏఎస్ ప్రకాష్ పనిచేస్తున్నారు. Related Post

సినిమా స‌మీక్ష