అనంతపురంలో రేపు దసరా ప్రీరిలీజ్ ఈవెంట్‌

March 25, 2023


img

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని, కీర్తి సురేశ్ జంటగా చేసిన దసరా ఈ నెల 30వ తేదీన విడుదల కాబోతోంది. కనుక రేపు ఆదివారం సాయంత్రం 6 గంటలకు అనంతపురం పట్టణంలో ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ జరుపబోతున్నట్లు ప్రకటించారు. 

ఈ సినిమాలో నాని సింగరేణి బొగ్గు గని కార్మికుడు నటిస్తున్నాడు. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, సముద్రఖని, ప్రకాష్ రాజ్, సాయి కుమార్, జారీనా వాహేబ్, షమ్నా ఖాసీం , రోశన్ మాథ్యూ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

నాని కెరీర్‌లో తొలిసారిగా భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళం, హిందీ భాషల్లో దీనిని పాన్ ఇండియా మూవీగా తీశారు. కనుక నాని, కీర్తి సురేష్, చిత్ర బృందం కలిసి దేశవ్యాప్తంగా పర్యటిస్తూ సినిమా ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. నాని బృందం నిన్న గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలో దసరా ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. 

 శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు కెమేర: సత్యన్ సూర్యన్, సంగీతం: సంతోష్ నారాయణన్, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు.Related Post

సినిమా స‌మీక్ష