టాలీవుడ్‌ నటుడు సుధీర్ వర్మ ఆత్మహత్య

January 23, 2023


img

టాలీవుడ్‌లో మరో విషాదం. యువనటుడు సుధీర్ వర్మ సోమవారం ఉదయం విశాఖపట్నంలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకొన్నాడు. సుధీర్ వర్మ కుందనపు బొమ్మ, సెకండ్ హ్యాండ్, షూటవుట్ ఎట్ ఆలేరు సినిమాలలో నటించాడు. కుందనపు బొమ్మ సినిమాలో సుధీర్ వర్మతో కలిసి నటించిన అతని స్నేహితుడు సుధాకర్ కోమాకుల ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. సుధీర్ వర్మ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని సుధాకర్ ట్వీట్‌ చేశారు. సుధీర్ వర్మ ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఇంకా తెలియవలసి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. Related Post

సినిమా స‌మీక్ష