దక్షిణ కొరియాలో సమంతకి ఆయుర్వేద చికిత్స?

November 30, 2022


img

నటి సమంత తనకు మయో సైటీస్ వ్యాధి ఉందని ప్రకటించినప్పటి నుంచి అభిమానులు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు ఆమె ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతూనే ఉన్నారు. యశోద చిత్రం విడుదలకి ముందు ఆమె చివరిగా యాంకర్ సుమకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ నెల 21వ తేదీన చివరిగా ట్విట్టర్‌లో యశోద సినిమా కలక్షన్స్‌ బాగా వస్తునందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకొన్నారు.  ఆ తర్వాత ఆమె సోషల్ మీడియాలో కూడా కనిపించడం లేదు. ఆమె ఆరోగ్యం క్షీణించిందని కనుక అత్యవసరంగా అమెరికాకి వెళ్ళి చికిత్స తీసుకొంటున్నారని వార్తలు వస్తే వాటిని ఆమె మేనేజర్ ఖండించారు. 

ఇప్పుడు సమంత ఆరోగ్యం మరింత క్షీణించిందని, తల్లితండ్రులు ఆమెను అమెరికా నుంచి దక్షిణ కొరియాలో ఆయుర్వేద చికిత్స కోసం తీసుకువెళ్ళినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఆమె మేనేజర్ ఈ వార్తలపై స్పందించడం లేదు. మయో సైటీస్ వ్యాధికి అమెరికాలో కూడా చికిత్స లేదని, ప్రపంచంలో కేవలం దక్షిణ కొరియాలో మాత్రమే ఆయుర్వేద చికిత్స అందుబాటులో ఉందని వార్తలు వినిపించాయి. కనుక తల్లితండ్రులు ఆమెను దక్షిణ కొరియాకి తీసుకువెళ్ళినట్లు సమాచారం. పూర్తిగా కోలుకొనేవరకు ఆమె అక్కడే ఉండవచ్చని తెలుస్తోంది. అయితే ఈ వార్తను సమంత తరపున దృవీకరించవలసి ఉంది. సమంత త్వరగా కోలుకొని మళ్ళీ ఎప్పటిలాగే మంచి మంచి సినిమాలలో నటించి అందరినీ మెప్పించాలని కోరుకొందాము. 


Related Post

సినిమా స‌మీక్ష