వాల్తేర్ వీరయ్య ప్రమో సాంగ్... దేవిశ్రీ హడావుడే ఎక్కువైందా?

November 22, 2022


img

మెగాస్టార్ చిరంజీవి-కెఎస్ రవీంద్ర (బాబీ) కాంబినేషన్‌లో వస్తున్న ‘వాల్తేర్ వీరయ్య’ సినిమాలో తొలి ప్రమో సాంగ్ విడుదలైంది. పూర్తి సాంగ్ బుదవారం సాయంత్రం 4.05 గంటలకు విడుదల చేయబోతున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ తెలియజేసింది. వెల్ కమ్ టు ది బిగ్గెస్ట్ పార్టీ... బాస్ పార్టీ అంటూ పాట మొదలుపెట్టి ‘నువ్వు లుంగీ ఎస్కో... హేయ్... నువ్వు షార్ట్ కూడా ఎస్కో హేయ్... నువ్వు కర్చీఫ్ ఎస్కో హేయ్...బాస్ వస్తుండు... హేయ్.. ’ అంటూ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ చెపుతుంటే మెగాస్టార్ చిరంజీవి లుంగీ ఎగేసి కట్టి స్టయిల్‌గా నోట్లో బీడీ పెట్టుకొని నోట్లో నుంచి పొగ వదులుతూ ఎంట్రీ ఇస్తాడు. “షర్ట్ ఏస్కో, లుంగీ ఏస్కో, కర్ఫీఫ్ ఏస్కో... అనేవి కూడా సినీ సాహిత్యంగా మార్చేసిన ఘనత కూడా దేవిశ్రీ ప్రసాద్‌దే. అయితే ఇది జస్ట్ ప్రమో కనుక పూర్తి పాట వింటే తప్ప సాహిత్యం గురించి అంచనా వేయడం తొందరపాటే అవుతుంది.      

వాల్తేర్ వీరయ్యలో చిరంజీవికి జోడీగా శ్రుతీ హాసన్ నటిస్తోంది. మాస్ మహారాజ రవితేజ ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర చేస్తున్నాడు. ఈ సినిమాకు బాబీ కధ, డైలాగ్స్ అందించగా, కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. 

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకి కెమెరా: ఆర్దర్ ఏ విల్సన్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. 2023 జనవరిలో సంక్రాంతి పండుగకు ఈ సినిమా విడుదల కాబోతోంది.Related Post

సినిమా స‌మీక్ష