టాప్ టెన్ హీరోయిన్లలో నంబర్: 1 ఎవరో తెలుసా?

September 22, 2022


img

సినీ పరిశ్రమలో ఎప్పుడూ నంబర్: 1 గేమ్ సాగుతూనే ఉంటుంది. కొంతమంది ఎన్నో దశాబ్ధాలు కష్టపడి ఆ స్థాయికి చేరుకొంటే కొంతమంది ఒకటి రెండు సినిమాలతో ఆ స్థాయికి చేరుకొంటారు. అయితే ఎంతమంది ఉన్నా నంబర్: 1 ఒక్కరే ఉంటారు. కనుక ఆ స్థానంలో ఎవరు ఎక్కువ కాలం నిలుస్తారనేదే గొప్ప విషయంగా సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. 

ప్రముఖ మీడియా సంస్థ ఓర్మాక్స్‌ ఏ నెలకు ఆ నెల టాప్ టెన్ హీరో హీరోయిన్ల జాబితా ప్రకటిస్తూ దానిలో ఆ నెలలో నంబర్: 1 స్థానంలో ఎవరున్నారో తెలియజేస్తుంటుంది. అయితే దీని కోసం ఆ సంస్థ ప్రధానంగా సోషల్ మీడియాలో వారు ఎంత యాక్టివ్‌గా ఉన్నారు?వారి సందేశాలకు అభిమానుల స్పందన ఏవిదంగా ఏ స్థాయిలో ఉంది?అనే అంశాలు పరిగణనలోకి తీసుకొని ఈ జాబితా విడుదల చేస్తుంటుంది. 

ఆగస్ట్ 2022లో దేశంలో టాప్ టెన్ హీరోయిన్ల జాబితాను ఓర్మాక్స్‌ ప్రకటించింది. దానిలో నంబర్:1 స్థానంలో సమంత నిలిచింది. సాధారణంగా బాలీవుడ్‌ హీరోయిన్లే టాప్ టెన్ జాబితాలో కనిపిస్తుంటారు. వారే నంబర్: 1 స్థానంలో నిలుస్తుంటారు. కానీ సమంత భర్త నుంచి విడిపోవడం, తర్వాత చేసిన సినిమాలు, ఇంటర్వ్యూలు వగైరా అంశాలపై సోషల్ మీడియాలో చాలా చర్చ జరిగింది. వాటిలో సమంత తమ మద్య జరిగినదంతా చెప్పనప్పటికీ, కుప్తంగా చెప్పవలసింది చెప్పింది. హీరోయిన్లు పెళ్ళి చేసుకొంటే సినిమా అవకాశాలు తగ్గిపోతాయి. కానీ సమంత పెళ్ళి చేసుకొన్నాక కూడా అనేక సూపర్ హిట్స్ ఇవ్వడమే కాకుండా భర్త నుంచి విడిపోయిన తర్వాత ఆ ఒత్తిడి, మనోవేదన, బాధ అన్నిటినీ అధిగమించి యశోద, శాకుంతలం వంటి హీరోయిన్ ఓరియంటడ్ సినిమాలు చేస్తోంది. పుష్ప సినిమాలో ఆమె చేసిన ‘ఊ అంటావా మావా’ పాట, డ్యాన్స్ ఎంత పాపులర్ అయ్యిందో అందరూ చూశారు. కనుక సోషల్ మీడియాలో ఆమెకు ఫాలోయింగ్, సానుభూతి కూడా పెరిగింది. కనుక ఆగస్ట్ నెలలో సమంత నంబర్: 1 స్థానంలో నిలిచినట్లు ఓర్మాక్స్‌ ప్రకటించింది.       

 ఆ తర్వాత స్థానాలలో వరుసగా బాలీవుడ్‌ నటి ఆలియా భట్ (బ్రహ్మస్త్ర హీరోయిన్), నయనతార, కాజల్ అగర్వాల్, దీపికా పడుకొనే, రష్మిక మందన, కీర్తి సురేష్, కత్రినా కైఫ్, పూజా హెగ్డే, అనుష్క శెట్టి నిలిచారు. 

సోషల్ మీడియాలో వారి యాక్టివిటీని ప్రధానంగా పరిగణనలోకి తీసుకొని ఈ ర్యాంకింగ్ ప్రకటించినప్పుడు, పూజాహెగ్డే, కీర్తి సురేశ్, రష్మిక మందన వంటి టాప్ హీరోయిన్స్ తమ ముందు తరం హీరోయిన్స్ కంటే వెనకబడిపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. 
Related Post

సినిమా స‌మీక్ష