హైదరాబాద్‌లో మళ్ళీ భారీ వర్షం షురూ

November 02, 2025


img

హైదరాబాద్‌ని ఈ వానలు ఇప్పట్లో విడిచిపెట్టేలా లేవు. ఆదివారం సాయంత్రం మళ్ళీ నగరంలో పలు ప్రాంతాలలో భారీ వర్షం మొదలైంది. గచ్చిబౌలి, మియాపూర్, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, గాజుల రామారం, నిజాంపేట, పటాన్‌చెరు, లింగంపల్లి, రామచంద్రా పురం, శేరిలింగం పల్లి తదితర ప్రాంతాలలో కుండపోతగా వాన కురుస్తోంది.

ఈరోజు సాయంత్రం 6-7 గంటల మద్య హైదరాబాద్‌ వెస్ట్, హైదరాబాద్‌ సెంట్రల్ పరిధిలో పలు ప్రాంతాలలో భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ ముందే హెచ్చరించింది. అయినప్పటికీ పనులపై బయటకు వెళ్ళిన నగర ప్రజలు జలమయమైన రోడ్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద చిక్కుకొని చాలా ఇబ్బంది పడుతున్నారు.

నిజామాబాద్‌, సిద్ధిపేట, రాజన్న సిరిసిల్లా జిల్లాలలో కూడా కుండపోతగా వాన కురుస్తోంది. నవంబర్‌ 4న బంగాళాఖాతంలో మళ్ళీ అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ చెప్పింది కనుక మళ్ళీ అప్పుడూ మరోసారి తెలంగాణలో వానలు తప్పకపోవచ్చు.


Related Post