మద్యం దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానం!

September 25, 2025


img

 తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాలకు లైసెన్స్ మంజూరు చేయబోతోంది. దీని కోసం ఆసక్తి, ఆర్ధిక స్తోమత కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. రేపు (శుక్రవారం) నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తుతో పాటు రుసుము రూ.3 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. 

వీటిలో కూడా రిజర్వేషన్స్‌ విధానం అమలు చేస్తారు. గౌడ సామాజిక వర్గానికి 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్స్‌ ఉంటాయి కనుక ఆయా వర్గాలకు చెందినవారు దరఖాస్తుదారులతో పాటు కులధృవీకరణ పత్రాలు కూడా జత చేయాల్సి ఉంటుంది. 

అక్టోబర్ 23న హైదరాబాద్‌లోని ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో లాటరీ తీసి దుకాణాలు కేటాయిస్తారు. ఈ లైసెన్సులు 2025 డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్‌ 30 వరకు రెండేళ్ళ కాలపరిమితితో జారీ చేస్తారు.


Related Post