వరదలలో రీల్స్ చేయొద్దు: తెలంగాణ పోలీస్

August 13, 2025


img

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి 17వ తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, కనుక ప్రభుత్వం, ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ పదేపదే హెచ్చరిస్తోంది. ఈ హెచ్చరికల నేపధ్యంలో తెలంగాణ పోలీస్ శాఖ కూడా సోషల్ మీడియా ద్వారా ప్రజలను అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తోంది.

ముఖ్యంగా యువత సెల్ఫీలు, రీల్స్ కోసం వరద నీటితో పొంగి ప్రవహిస్తున్న వాగులు వంకలు, నదుల వద్దకు వెళ్ళవద్దని హెచ్చరించింది. రీల్స్ కోసం సాహసాలు చేసి ప్రాణాలు పోగొట్టుకోవద్దని హితవు పలికింది. వాతావరణ శాఖ చేస్తున్న హెచ్చరికలను గమనిస్తూ అందరూ అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ పోలీస్ శాఖ విజ్ఞప్తి చేసింది. 

తెలంగాణ పోలీస్ ఈ కోణంలో కూడా ఆలోచించి యువతని ఈవిదంగా హెచ్చరించడం చాలా అభినందనీయమే. యువత తల్లి తండ్రులు లేదా ఇంట్లో పెద్దవారు కూడా పిల్లలు, యువతని ఈ మూడు రోజులు ఇల్లు దాటి బయటకు వెళ్ళకుండా కట్టడి చేసి జాగ్రత్తగా కాపాడుకోవడం చాలా మంచిది. 

తెలంగాణ పోలీస్ శాఖ చేస్తున్న ఈ సూచనలు అందరూ విధిగా పాటించడం చాలా మంచిది.


Related Post