మెస్సీతో ఫుట్‌బాల్‌ ఆడేందుకు టైమ్‌ ఉంది కానీ.. హరీష్ రావు

December 14, 2025
img

అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ మెస్సీతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి శనివారం సాయంత్రం ఉప్పల్ స్టేడియంలో ఫుట్‌బాల్ ఆడారు. తెలంగాణ ముఖ్యమంత్రి యువకులతో కలిసి మైదానంలో ఫుట్‌బాల్ ఆడటం యావత్ దేశ ప్రజలను ఆకట్టుకుంది. కానీ హరీష్ రావుకి నచ్చలేదు.

ఆయన మీడియాతో మాట్లాడుతూ, “మెస్సీతో ఫుట్‌బాల్ ఆడేందుకు సీఎం రేవంత్ రెడ్డికి టైమ్ ఉంది. కానీ నగరంలో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు ఫుడ్ పాయిజన్ వల్ల ఆస్పత్రిపాలైతే పరామర్శించేందుకు టైమ్ లేదు. నగరంలో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల పరిస్థితి ఈ విధంగా ఉంటే, రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో విద్యార్థుల పరిస్థితి ఏమిటి? ఈ ముఖ్యమంత్రికి, మంత్రులకు ఎంతసేపు ఇలాంటి హడావుడే తప్ప ప్రజల సమస్యలు పట్టించుకోరు.

తినడానికి తిండి లేదు… మీసాలకు సంపెంగ నూనె కావాలన్నట్లు. పిల్లలకి ఇంత అన్నం పెట్టలేడు కానీ 2047 నాటికి మూడు బిలియన్ డాలర్ల ఎకానమీ సాధిస్తానంటాడు. రేవంత్ రెడ్డి పాలసీ ‘పాయిజన్ 2047’లా ఉంది,” అంటూ ఎద్దేవా చేశారు.

హరీష్ రావు ఏమన్నారో ఆయన మాటల్లోనే…

Related Post