కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ 55 ఏళ్ళు వచ్చినా ఇంకా పెళ్ళి చేసుకోకుండా బ్యాచిలర్‌గానే ఉండిపోయారు. కానీ ఆయన మేనల్లుడు రెహాన్ వాద్రా 25 ఏళ్ళకే పెళ్ళి పీటలు ఎక్కుతున్నాడు. అతని బాల్య స్నేహితురాలు అవీవా బేగ్‌తో రెండు రోజుల క్రితం రాజస్థాన్‌లోని రణతంబోర్‌లో వారి వివాహా నిశ్చితార్ధం జరిగింది. ప్రియాంక వాద్రా వారివురి ఫోటోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి, వారి వివాహ నిశ్చితార్ధం గురించి మీడియాలో వచ్చిన వార్తలు నిజమే అని ధృవీకరించారు. అవీవా బేగ్ జర్నలిజం డిగ్రీ చేసింది. ఆమె స్ట్రీట్ లైఫ్, వైల్డ్ లైఫ్ ఫోటో గ్రాఫర్‌గా సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయ్యారు.