అహ్మదాబాద్‌ దెబ్బ: ఎయిర్ ఇండియా 8 విమానాలు రద్దు!

June 20, 2025
img

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంతో ఎయిర్ ఇండియా సంస్థ ప్రతిష్ట మంట గలిసిపోయింది. విమాన ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ఎయిర్ ఇండియా సంస్థ క్షమాపణలు చెప్పుకొని, మృతులు ఒక్కొక్కరికీ కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లిస్తామని, గాయపడినవారికి వైద్య చికిత్సలకు అయ్యే ఖర్చులను పూర్తిగా భరిస్తామని ప్రకటించింది.

కానీ ఎయిర్ ఇండియా విమానాల పరిస్థితిపై ప్రయాణికులలో అనుమానాలు, భయాందోళనలు నెలకొని ఉండటం పలు జాతీయ, అంతర్జాతీయ విమానాలను రద్దు చేసింది. 

రద్దు చేసిన విమానాలలో టికెట్స్ బుక్ చేసుకున్నవారికి సొమ్ము పూర్తిగా వాపసు పొందవచ్చని లేదా వేరే తేదీలకు టికెట్స్ మార్చుకునే వెసులుబాటు కల్పిస్తున్నామని తెలియజేసింది. 

ఈ నెల 21 నుంచి జూలై 15 వరకు మూడు అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేసినట్లు ఎయిర్ ఇండియా తెలియజేసింది. రద్దు చేసిన విమానాలు: 

అంతర్జాతీయ సర్వీసులు:  దుబాయ్‌-చెన్నై(ఏఐ 906); ఢిల్లీ-మెల్‌బోర్న్(ఏఐ308); మెల్‌బోర్న్-ఢిల్లీ (ఏఐ309); దుబాయ్‌-హైదరాబాద్‌ (ఏఐ 2204).

జాతీయ సర్వీసులు: పూణే-ఢిల్లీ (ఏఐ874); అహ్మదాబాద్‌-ఢిల్లీ (ఏఐ 456); హైదరాబాద్‌-ముంబయి (ఏఐ 2872); చెన్నై-ముంబయి (ఏఐ 571). 

ఇవికాక ఢిల్లీ-నైరోబీ, అమృత్‌సర్‌-లండన్, గోవా-లండన్ సర్వీసులు జూలై 15 వరకు పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. 

ఢిల్లీ-టొరంటో, ఢిల్లీ-వాంకోవర్, ఢిల్లీ-శాన్‌ఫ్రాన్సిస్‌కో, ఢిల్లీ-వాషింగ్‌టన్, ఢిల్లీ-చికాగో మార్గాలలో సర్వీసులను తగ్గిస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. అలాగే అమెరికా-యూరప్-ఆసియా దేశాల మద్య తిరిగే విమాన సర్వీసులను కూడా తగ్గిస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. 

ఎయిర్ ఇండియా విమానాల పట్ల ప్రయాణికులలో నమ్మకం పెంచేందుకు బోయింగ్ 777 మరియు 787 విమానాలఉ క్షుణ్ణంగా తనిఖీలు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. 

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం వలన కలిగిన ఎయిర్ ఇండియాకి కలిగిన నష్టమే చాలా ఉంటే, ఒకేసారి ఇన్ని విమాన సర్వీసులను రద్దు చేయడం వలన మరింత భారీగా నష్టపోనున్నది. కానీ ఇది ఎయిర్ ఇండియా విశ్వసనీయతని పునరుద్దరించడానికి ఎంతగానో తోడ్పడుతుంది.        


Related Post