అగ్ని క్షిపణి సరికొత్త ప్రయోగం: రైల్వే వ్యాగన్‌పై నుంచి!

September 25, 2025
img

భారత్‌ మరియు డీఆర్డీవో చరిత్రలో తొలిసారిగా ఒక విన్నూత్నమైన ప్రయోగం విజయవంతంగా జరిగింది. 2,000 కిమీ దూరంలో లక్ష్యాలను చేదించగల అగ్ని ప్రైమ్‌ క్షిపణిని ఓ రైల్వే వేగన్‌పై నుంచి విజయవంతంగా ప్రయోగించారు. ఈ ప్రయోగం విజయవంతం అయ్యిందని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోషల్ మీడియా ద్వారా దేశ ప్రజలకు తెలియజేసి, డీఆర్డీవో శాస్త్రవేత్తలను అభినందించారు.

రైల్ ఆధారిత మొబైల్ లాంచింగ్ పరీక్ష విజయవంతం అవడంతో అత్యవసర పరిస్థితులలో అగ్నిక్షిపణితో పాటు ఇతర క్షిపణలులను కూడా దేశంలో కావలసిన ప్రాంతానికి వేగంగా తరలించి ప్రయోగించవచ్చు. శత్రువులపై దాడి చేసిన తర్వాత మళ్ళీ శత్రువుల రాడార్లు పసిగట్టేలోగా అక్కడి నుంచి వేరే చోటికి తరలించవచ్చు. కనుక ఇదొక వినూత్నమైన ఆలోచనతో చేసిన సంచలన ప్రయోగమే అని భావించవచ్చు. 

దీని కోసం డీఆర్డీవో ప్రత్యేకంగా మొబైల్ లాంచర్ (వేగన్) తయారు చేసింది. దానిపై నుంచి అగ్ని క్షిపణి నిప్పులు కక్కుతూ నింగిలోకి దూసుకుపోయింది. 

అగ్ని ప్రైమ్‌ క్షిపణిలో చాలా ప్రత్యేకతలున్నాయి. ఇది అణువార్ హెడ్ మోసుకుపోయి శత్రుదేశాలపై భీకర దాడి చేయగలదు. దీనిలో రింగ్ లేజర్ గైరో ఆధారిత ఇనర్శల్ నేవీగేషన్‌ సిస్టం, మైక్రో ఇనర్శల్ నేవీగేషన్‌ సిస్టం, దేశీయ నావిక్ శాటిలైట్ నేవిగేషన్ సిస్టం, జీపీఎస్ నేవిగేషన్ సిస్టంలలో దేనినైన వాడుకోగల అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉంది.       

Related Post