తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యాదగిరి గుట్టతో సహా మరో మూడు పర్యాటక ప్రాంతాలకు రోప్ వే ఏర్పాటు కాబోతోంది. కేంద్ర ప్రభుత్వం ‘పర్వతమాల’ పేరుతో దేశవ్యాప్తంగా 200 రోప్ వే ప్రాజెక్టులు నిర్మించబోతోంది. వాటిలో భాగంగా తెలంగాణలో నాలుగు రోప్ వేలు నిర్మించబోతోంది.
తెలంగాణ రాష్ట్రంలో నిర్మించబోతున్న రోప్ వే ప్రాజెక్టులు ఇవే:
1. యాదగిరి గుట్టపైకి చేరుకునేందుకు 1.1 కిమీ.
2. నల్గొండ జిల్లా కేంద్రంలోని హనుమాన్ కొండపై 1.2 కిమీ.
3. నాగార్జునకొండ నుంచి నాగార్జున సాగర్ డ్యామ్ వరకు 1.7 కిమీ.
4. పెద్దపల్లి జిల్లా మందనిలోని కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం-మందని-రామగిరి కోటకు 2.4 కిమీ పొడవుండే రోప్ వే నిర్మించబోతోంది.
వీటి నిర్మాణం కోసం జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్ఏఐ) పరిధిలో పనిచేసే జాతీయ రహదారుల లాజిస్టిక్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ (ఎన్‌హెచ్‌ఎల్ఎంఎల్)కు బాధ్యతలు అప్పగించింది.
ఎన్‌హెచ్‌ఎల్ఎంఎల్ వెంటనే ఈ రోప్ వే ప్రాజెక్టుల నిర్మాణం కొరకు సమగ్ర నివేదిక అందజేసేందుకు టెండర్లు ఆహ్వానించింది. బిడ్స్ సమర్పించేందుకు అక్టోబర్ 21 వరకు గడువు విధించింది.