విక్రమ్, ప్రగ్యాన్‌లకు ఇస్రో సుప్రభాతం

September 22, 2023
img

చంద్రయాన్-3లో భాగంగా ఆగస్ట్ 23వ తేదీన విక్రమ్ ల్యాండర్ చంద్రుడి దక్షిణధ్రువంపై విజయవంతంగా సాఫ్ట్ లాండింగ్ కాగా, దానిలో నుచి ప్రగ్యాన్ రోవర్ బయటకు వచ్కి కీలకమైన పరిశోధనలు చేసి ఆ వివరాలను ఇస్రోతో సహా అనేక దేశాలకు పంపింది. 

మన కాలమాన ప్రకారం చంద్రుడిపై 14 రోజులు పగలు, 14 రోజులు రాత్రి ఉంటాయి. కనుక పగటి పూటే చంద్రుడిపై సూర్యకాంతి ఉంటుంది కనుక దాంతో విక్రమ్, ప్రగ్యాన్‌లో అమర్చిన సోలార్ సిస్టమ్ ఛార్జింగ్ అవుతుంటే రెండూ తమ పరిశోధనలు 14 రోజులు కొనసాగించాయి. 

అయితే చంద్రుడిపై రాత్రిపూట మైనస్ 200 డిగ్రీలకు ఉష్ణోగ్రత పడిపోతుంది. విక్రమ్, ప్రగ్యాన్‌ దానిని తట్టుకొనగలిగితే మళ్ళీ పనిచేస్తాయి. కనుక ఇన్ని రోజులు వాటిని నిద్రపుచ్చిన్న ఇస్రో శాస్త్రవేత్తలు ఇప్పుడు మళ్ళీ వాటిని మేల్కొలిపేందుకు సిద్దం అవుతున్నారు. 

అవి తప్పకుండా పనిచేస్తాయనే ఇస్రో శాస్త్రవేత్తలు నమ్మకంతో ఉన్నారు. ఆ రెండూ పనిచేస్తాయా లేదా అనే విషయం శనివారం స్పష్టత వస్తుంది. ఒకవేళ అవి పనిచేయగలిగితే ఇస్రో మరో ఘన విజయం సాధించిన్నట్లే. వాటితో మళ్ళీ మళ్ళీ ప్రయోగాలు నిర్వహించగలుగుతుంది.

Related Post