నెట్‌ఫ్లిక్స్‌లోకి టిల్లూ స్క్వేర్

April 20, 2024


img

సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన టిల్లూ స్క్వేర్ మార్చి 29న థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ అయ్యింది. ముఖ్యంగా ఈ సినిమాలో సిద్ధూ జొన్నలగడ్డ యాక్షన్, కామెడీ టైమింగ్ ప్రేక్షకులను చాలా ఆకట్టుకోగా, హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్ రెచ్చిపోయి అందాలు ప్రదర్శిస్తూ కుర్రకారుని కవ్వించింది. కధ, కధనం రెండూ చక్కగా కుదరడంతో సినిమా హిట్ అయ్యింది మంచి కలక్షన్స్‌ రాబడుతోంది. 

ఇప్పుడు ఈ సినిమా ఈ నెల 26 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కాబోతోందని నెట్‌ఫ్లిక్స్‌ స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ 5 భాషల్లో ఒకేసారి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కాబోతోంది. 

 ఈ సినిమాకి సంగీతం: రామ్ మిర్యాల, అచు రాజమణి, కెమెరా: సాయి ప్రకాష్, ఎడిటింగ్: నవీన్ నూలి చేశారు.  

మల్లిక్ రామ్ దర్శకత్వంలో సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్టూన్ సినిమాస్ బ్యానర్లపై ఈ సినిమా నిర్మించారు.


Related Post

సినిమా స‌మీక్ష