యూపీలో మిస్టర్ బచ్చన్

April 19, 2024


img

మాస్ మహరాజ రవితేజ, మాస్ డైరెక్టర్‌ హరీష్ శంకర్‌ కలిస్తే అది ఎంత మ్మాస్‌ సినిమా అవుతుందో ఊహించుకోవచ్చు. వీరిద్దరూ కలిసి ‘మిస్టర్ బచ్చన్’ అనే సినిమా మొదలుపెట్టి చాలా రోజులే అయ్యింది.

దీని కోసం ‘మిస్టర్ బచ్చన్’ టీం ఉత్తరప్రదేశ్‌కు వెళ్ళి అక్కడ ఏకధాటిగా 30 రోజులు షూటింగ్‌ చేసి హైదరాబాద్‌ తిరిగివచ్చేసింది. వచ్చేటప్పుడు అందరూ అయోధ్యకు వెళ్ళి బాలరాముడిని దర్శించుకొన్నారు. దర్శకుడు హరీష్ శంకర్‌ ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభిమానులతో పంచుకున్నారు.   

ఈ సినిమాలో రవితేజ బాలీవుడ్‌ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్‌ స్పూర్తితో ఎదిగిన వ్యక్తిగా నటిస్తున్నట్లు సినిమా పేరు, పోస్టర్ చూస్తే అర్దమవుతుంది. రవితేజకు జోడీగా భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్‌గా నటిస్తుండగా జగపతిబాబు ఓ ముఖ్యపాత్ర చేస్తున్నారు. ఇటీవలే ఆయన పోస్టర్ కూడా విడుదల చేశారు. 

పనోరమ స్టూడియోస్, టీ సిరీస్ స్టూడియోస్ బ్యానర్లపై టిజి విశ్వప్రసాద్, వివేక్‌ అగ్నిహోత్రి కూచిబొట్ల కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం మిక్కీ జె. మేయర్ అందిస్తున్నారు.


Related Post

సినిమా స‌మీక్ష