రేపే లాసెట్, పీజీ లాసెట్ ఫలితాలు ప్రకటన

June 12, 2024
img

తెలంగాణ ఉన్నత విద్యామండలి గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు లాసెట్, పీజీ లాసెట్ ఫలితాలు ప్రకటించబోతోంది. తెలంగాణ రాష్ట్రంలో న్యాయ కళాశాలలో ఎల్ఎల్‌బీ మరియు ఎల్ఎల్ఎం కోర్సులలో ప్రవేశాల కొరకు జూన్ 3వ తేదీన లాసెట్, పీజీ లాసెట్ ప్రవేశ పరీక్షలు నిర్వహించింది.

వాటి ఫలితాలే రేపు మధ్యాహ్నం విడుదల చేయబోతున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. ఈ ఫలితాలను తెలంగాణ ఉన్నత విద్యామండలి అధికారిక వెబ్‌సైట్‌లో లేదా ఈనాడు తదితర ప్రముఖ మీడియాసంస్థల వెబ్‌సైట్‌లలో చూసుకోవచ్చు.  

ఈరోజు మధ్యాహ్నం సిఎం రేవంత్‌ రెడ్డి ఉపాధ్యాయ అర్హత పరీక్షలు (టెట్) ఫలితాలను విడుదల చేశారు. టెట్ పేపర్-1 పేపర్ పరీక్షకు  85,996 మంది హాజరుకాగా వారిలో 57,725 మంది అంటే 67.13 శాతం మంది మాత్రమే అర్హత సాధించారు. అదేవిదంగా టెట్ పేపర్-2 పేపర్ పరీక్షకు 1,50,491 మంది హాజరుకాగా వారిలో 51,443 మంది అంటే 34.18 శాతం మంది మాత్రమే అర్హత సాధించారు. 

రాష్ట్రంలోని బీఈడీ కళాశాలలో ప్రవేశాల కొరకు నిర్వహించిన టిజిఎడ్ సెట్-2024 ప్రవేశ పరీక్షల ఫలితాలను తెలంగాణ ఉన్నత విద్యామండలి నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే.

Related Post