ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్‌కు ఈడీ నోటీసు పంపింది. తమిళనాడులోని తిరుచ్చిలో ప్రణవ్ జూవెలర్స్ అనే సంస్థ ప్రజల నుంచి భారీగా డిపాజిట్లు సేకరిస్తోందనే ఆరోపణలు వస్తుండటంతో ఈ నెల 20న ఈడీ ఆ సంస్థలో సోదాలు జరిపి సుమారు వంద కోట్లు దారి మళ్ళించిందని కనుగొంది.ఆ సంస్థపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది.
ఆ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ప్రకాష్ రాజ్‌కు కూడా నోటీస్ పంపింది. ఆ సంస్థ ఆయన సేవలు ఉపయోగించుకొంటున్నందున ఆయనకు భారీగా ఫీజ్ చెల్లిస్తున్నందున, ఈడీ ఆయనకు కూడా నోటీస్ పంపింది. వచ్చే వారం చెన్నైలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొంది.
ప్రకాష్ రాజ్ బీజేపీ మతతత్వ రాజకీయాలను విమర్శిస్తుంటారు. ప్రధాని నరేంద్రమోడీపై కూడా సోషల్ మీడియాలో వ్యంగ్యంగా విమర్శలు చేస్తుంటారు. కనుక ఏదో రోజు ఆయనపై కూడా ఐటి దాడులు తప్పవని అందరూ అనుకొంటూనే ఉన్నారు. కానీ ఆయన ఐటి లెక్కలు పక్కాగా ఉండటంతో ఎట్టకేలకు ఈవిదంగా ఈడీ ద్వారా బుక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనబడుతోంది.