సంక్రాంతి పండుగకు ముందు ఓ విషాద ఘటన జరిగింది. సిద్ధిపేట జిల్లా, మర్కూక్ మండలంలో కొండ పోచమ్మ సాగర్ డ్యామ్‌లో ఐదుగురు యువకులు మృతి చెందారు.
హైదరాబాద్ నుంచి సిద్ధిపేటకు వ చ్చిన ఏడుగురు యువకులు సరదాగా ఈత కొట్టేందుకని శనివారం ఉదయం కొండపోచమ్మ సాగర్ డ్యామ్‌లో దిగారు. కానీ ఈత సరిగ్గా రాకపోవడంతో ఐదుగురు యువకులు నీళ్ళలో మునిగి చనిపోయారు.
మృగాంక్ (17) ఇబ్రాహీం (20) అనే ఇద్దరు యువకులు మాత్రం ఎలాగో ఒడ్డుకు చేరుకొని పరుగున గ్రామానికి వెళ్ళి గ్రామస్థులలకు చెప్పడంతో గ్రామస్తులు డ్యామ్ వద్దకు చేరుకుని వారి కోసం గాలించారు.
సమాచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్ళని వెంటబెట్టుకొని వచ్చి డ్యామ్ లో గాలించి వారి నుంచి మృత దేహాలు బయటకు తీశారు. చనిపోయినవారు హైదరాబాద్‌కు చెందిన ధనుష్ (20), లోహిత్ (17), జతిన్ (17), శ్రీనివాస్ (17), దినేశ్వర్ (17)గా పోలీసులు గుర్తించారు. వారిలో ధనుష్, లోహిట్ అన్నదమ్ములు.
అందరూ హైదరాబాద్‌లో చదువుకుంటున్నారు. కాలేజీలకు సంక్రాంతి సెలవులు ఇవ్వడంతో సిద్ధిపేటకు వచ్చి సరదాగా ఈతకు దిగి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని వారి మృతదేహాలను పోస్టు మార్టం కొరకు జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించి వారి తల్లి తండ్రులకు సమాచారం అందించారు.