లోక్‌సభ హడావుడి తర్వాత ఇక ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి

May 15, 2024


img

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల హడావుడి సోమవారం పోలింగ్‌తో ముగిసింది. ఇప్పుడు వరంగల్‌-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల హడావుడి మొదలైపోయింది. ఈ నెల 27వ తేదీన పోలింగ్‌ జరుగబోతోంది. కాంగ్రెస్‌ అభ్యర్ధిగా తీన్మార్ మల్లన్న, బిఆర్ఎస్ అభ్యర్ధిగా ఏనుగుల రాకేశ్ రెడ్డి, బీజేపీ అభ్యర్ధిగా ప్రేమ్ చందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. 

ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్సీగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్ రెడ్డి శాసనసభ ఎన్నికలలో జనగామ నుంచి పోటీ చేసి గెలవడంతో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. అందువల్ల ఈ ఉప ఎన్నిక జరుగుతోంది.

ఈ నెల 27వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. జూన్ 5వ తేదీన ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.

తెలంగాణలో తిరుగే లేదనుకున్న బిఆర్ఎస్ పార్టీ శాసనసభ ఎన్నికలలో ఓడిపోవడంతో ఆ తర్వాత జరిగే ప్రతీ ఎన్నికలలో గెలవడం దానికి ముఖ్యమయ్యాయి. కనుక లోక్‌సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోరాడిన బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ సీటుని కూడా గెలుచుకునేందుకు గట్టిగా కృషి చేస్తోంది.


Related Post