శుక్రవారం నుంచి పది రోజులు థియేటర్లు బంద్

May 15, 2024


img

లోక్‌సభ ఎన్నికల ఎఫెక్ట్ సినీ పరిశ్రమపై, తెలంగాణలో సినిమా థియేటర్లపై పడింది. పాఠశాలలు, కాలేజీలకు ఏప్రిల్‌, మే నెలల్లో వేసవి సెలవులు ఇస్తారు కనుక ఈ సమయంలో చిన్నా పెద్ద హీరోలు సినిమాలు విడుదల చేసుకోవడానికి పోటీ పడుతుంటారు. ఈసారి వేసవి సెలవులకి అనేక సినిమాలు విడుదల కావలసి ఉంది. కానీ తెలంగాణలో లోక్‌సభ, ఆంధ్రాలో లోక్‌సభతో పాటు శాసనసభ ఎన్నికలు జరుగుతుండటంతో పలు సినిమాలు వాయిదా పడ్డాయి. 

ఈ ఎన్నికల హడావుడి కారణంగా తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ప్రేక్షకులు తగ్గిపోయారు. దీంతో సినిమా ప్రదర్శనతో వచ్చిన ఆదాయం కంటే థియేటర్ల నిర్వహణ ఖర్చే ఎక్కువగా ఉంటోంది. కనుక ఈ శుక్రవారం నుంచి పది రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూసేయాలని థియేటర్ల యాజమానుల సంఘం నిర్ణయించింది. 

సినిమాలు, రాజకీయాల గురించి చెప్పుకుంటే అందరూ వినోదింపజేసె సినిమాలకే మొగ్గు చూపుతుంటారు. కానీ తెలంగాణ ప్రజానీకం సినిమాల కంటే రాజకీయాలపైనే ఎక్కువ మక్కువ చూపుతుండటం విశేషం. 


Related Post