బీజేపీ హిందుత్వ అజెండాపై ఓ పక్క నిత్యం విమర్శలు వెల్లువెత్తుతుంటే, యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాధ్ మాత్రం ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఆయన సాధు వస్త్రధారణలోనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తుంటారని అందరికీ తెలుసు.
ఇప్పుడు కాశీ విశ్వనాధుడి ఆలయంలో పనిచేసే పోలీసులను కూడా సాధువులుగా మార్చేశారు. ఇకపై అందరూ యూనిఫారంలు బదులు ఎరుపు రంగు ధోతీ, కుర్తా, కండువా, మెడలో రుద్రాక్షమాల, నుదుట విభూదీ ధరించి విధులు నిర్వహించాలని నగర పోలీస్ కమీషనర్‌గా మోహిత్ అగర్వాల్ ద్వారాదేశాలు జారీ చేయించారు.
ముఖ్యమంత్రికి తెలియకుండా లేదా ఆయన ఆదేశించకుండా పోలీస్ కమీషనర్ తనంతట తానుగా ఇటువంటి నిర్ణయం తీసుకోలేరు. కనుక ప్రజలు, ప్రతిపక్షాలు, మీడియా అప్పుడే ముఖ్యమంత్రి నిర్ణయాన్ని తప్పు పడుతూ విమర్శలు చేస్తున్నారు.