మాకొద్దీ ప్రభుత్వ సలహాదారులు, ప్రత్యేక అధికారులు!

December 09, 2023


img

సిఎం రేవంత్‌ రెడ్డి ఊహించిన దానికంటే చాలా వేగంగా నిర్ణయాలు తీసుకొంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో నియంపబడిన 8 మండి సలహాదారులను, నలుగురు ప్రత్యేక అధికారులను తక్షణం పదవులలో నుంచి తొలగించారు. ఈ మేరకు సిఎస్ శాంతికుమారి శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. 

తొలగింపబడిన ప్రభుత్వ సలహాదారులు: 

రాజీవ్ శర్మ, చెన్నమనేని రమేష్: ప్రభుత్వ ప్రధాన సలహాదారులు

సోమేశ్ కుమార్‌: సిఎం ముఖ్య సలహాదారు

అనురాగ్ శర్మ: హోంశాఖ సలహాదారు

కేవీ రమణాచారి: దేవాదాయ, సాంస్కృతిక సలహాదారు

ఏకే ఖాన్: ముస్లిం మైనార్టీ సంక్షేమ సలహాదారు

శోభ: అటవీ సంరక్షణ సలహాదారు

శ్రీనివాసరావు: ఉద్యానవన శాఖ సలహాదారు  

తొలగింపబడిన ప్రత్యేకాధికారులు: 

సుధాకర్ తేజ: ఆర్‌ అండ్ బి స్పెషల్ ఆఫీసర్

జీఆర్ రెడ్డి, శివశంకర్: ఆర్ధిక శాఖ స్పెషల్ ఆఫీసర్స్

రాజేంద్ర ప్రసాద్ సింగ్: ఇంధన సెక్టర్ స్పెషల్ ఆఫీసర్.


Related Post