తెలంగాణ మంత్రులు... వారి శాఖలు

December 09, 2023


img

తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి శుక్రవారం రాత్రి మళ్ళీ ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్‌ అధిష్టానంతో చర్చించిన తర్వాత మంత్రులకు శాఖలు ఖరారు చేశారు. రేవంత్‌ రెడ్డి హోమ్, మునిసిపల్, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ తదితర కొన్ని శాఖలను మాత్రం తన వద్దే అట్టేబెట్టుకొన్నారు. 

భట్టి విక్రమార్క: ఆర్ధిక, ఇందన శాఖలు

దామోదర రాజనర్సింహ: వైద్య, ఆరోగ్యశాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ 

ఉత్తమ్ కుమార్‌ రెడ్డి: నీటి పారుదల, పౌరసరఫర

దుద్దిళ్ళ శ్రీధర్ బాబు: ఐ‌టి, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాలు 

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి: రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి: రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖలు

తుమ్మల నాగేశ్వరరావు: వ్యవసాయం, చేనేత 

జూపల్లి కృష్ణారావు: ఎక్సైజ్, పర్యాటక శాఖలు

పొన్నం ప్రభాకర్: రవాణా, బీసీ సంక్షేమం

సీతక్క: పంచాయితీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖలు 

కొండా సురేఖ: దేవాదాయ, అటవీ పర్యావరణ శాఖలు.


Related Post