మంత్రులకు శాఖలు కేటాయించలేదు: సిఎంవో

December 08, 2023


img

నిన్న ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం ముగిసిన తర్వాత మంత్రులు వారి శాఖలు ఇవేనంటూ మీడియా, సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ముఖ్యమంత్రి కార్యాలయం వాటిని ఖండించింది. ఇంతవరకు మంత్రులు ఎవరికీ శాఖలు కేటాయించలేదని ప్రకటన విడుదల చేసింది. రేపు (శనివారం) శాసనసభలో ఎమ్మెల్యేల ప్రమాణస్వీకార  కార్యక్రమం జరుగుతుంది. అది పూర్తయిన తర్వాత మంత్రుల శాఖలు కేటాయించవచ్చని సమాచారం. 

ఈరోజు ఉదయం ప్రజాభవన్‌లో సిఎం రేవంత్‌ రెడ్డితో సహా మంత్రులు ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల నుంచి నేరుగా వినతిపత్రాలు స్వీకరించారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత సిఎం రేవంత్‌ రెడ్డి విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో ఆ శాఖ అప్పులు, విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, వినియోగం తదితర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.


Related Post