నేడు హైదరాబాద్‌లో ప్రధాని మోడీ రోడ్ షో

November 27, 2023


img

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు రాష్ట్రానికి వచ్చిన ప్రధాని నరేంద్రమోడీ సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి నగరంలో రోడ్ షోలో పాల్గొనబోతున్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి చిక్కడపల్లి, నారాయణగూడా  మీదుగా కాచిగూడ చౌరస్తాలోని వీరసావర్కర్ విగ్రహం వరకు రోడ్ షో నిర్వహించనున్నారు. రోడ్ షో ముగిసిన తర్వాత కాచిగూడ వద్ద ప్రధాని నరేంద్రమోడీ ప్రజలను ఉద్దేశ్యించి ప్రసంగించనున్నారు. 

ప్రధాని నరేంద్రమోడీ రోడ్ షో కొరకు పరిసర మార్గాలలో ట్రాఫిక్ ఆంక్షలు విధించి వాహనాలను వేరే మార్గాలలోకి మళ్ళిస్తున్నారు. ఆ మార్గంలో ఇరువైపులా అనేక భవనాలు, దుకాణా సముదాయాలు, సినిమా హాల్స్ వగైరా ఉన్నందున భారీగా పోలీసులను మోహరించి భద్రతా ఏర్పాట్లు చేశారు.

భద్రతాకారణాల చేత ఈరోజు సాయంత్రం 4.30 నుంచి 6.30 గంటల వరకు చిక్కడపల్లి, నారాయణగూడ మెట్రో రైల్వే స్టేషన్లను మూసివేస్తున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు. అయితే ఆ రెండు స్టేషన్లలో మీదుగా మెట్రో రైళ్ళు యధాప్రకారం నడుస్తుంటాయని తెలిపారు. 


Related Post