బండి సంజయ్‌, కల్వకుంట్ల కవిత పలకరింపులు... భలే ఉన్నాయే!

May 31, 2023


img

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌, సిఎం కేసీఆర్‌ కుమార్తె, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈరోజు ఒకరికొకరు ఓ కార్యక్రమంలో ఎదురుపడినప్పుడు నవ్వుతూ పలకరించుకొన్నారు. నిజామాబాద్‌ బిజెపి నేత బస్వా నర్సయ్య గృహాప్రవేశ కార్యక్రమానికి ఇద్దరినీ ఆహ్వానించడంతో ముందుగా బండి సంజయ్‌ వచ్చారు. కొద్ది సేపటి తర్వాత కల్వకుంట్ల కవిత కూడా వచ్చారు. అప్పుడు బండి సంజయ్‌ ఆమెను చూసి మర్యాదపూర్వకంగా నవ్వుతూ చేతులు జోడించి నమస్కరించగా ఆమె కూడా నవ్వుతూ నమస్కరించారు. అక్కడే ఉన్న నిజామాబాద్‌ అర్బన్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా వారిరువురికీ జిల్లా జెడ్పీ ఛైర్మన్‌ విఠల్ రావును పరిచయం చేయగా, ఆయనతో కాసేపు మాట్లాడి కల్వకుంట్ల కవిత లోనికి వెళ్ళిపోయారు. ఇద్దరు నేతలు చాలా హుందాగా వ్యవహరించి గౌరవం నిలబెట్టుకొన్నారు కానీ అదృష్టవశాత్తు వారి అనుచరులు కూడా ఎటువంటి నినాదాలు చేయకుండా సంయమనం పాటించడంతో ఈ కార్యక్రమంలో ఎటువంటి రసాభాస జరగకుండా సవ్యంగా ముగిసిపోయింది. బండి సంజయ్‌ నిత్యం కల్వకుంట్ల కవితను, సిఎం కేసీఆర్‌ను తీవ్రంగా విమర్శిస్తూ, తీవ్ర ఆరోపణలు చేస్తుండటం అందరికీ తెలిసిందే. ఆమె కూడా బండి సంజయ్‌, ప్రధాని నరేంద్రమోడీ, బిజెపిపై తీవ్ర విమర్శలు చేస్తుంటారు. కానీ ఇద్దరూ ఈ కార్యక్రమానికి అతిధులుగా రావడంతో సంయమనం పాటించి గౌరవం కాపాడుకొన్నారు.         Related Post